...

...

8, సెప్టెంబర్ 2012, శనివారం

శీలావి కథ!


      "దేశంలో పైతరగతి, మధ్యతరగతి, కింది తరగతి అంటూ మూడు వర్గాలున్నట్టే రైళ్ళల్లోనూ ఉన్నాయి. ఇప్పట్లో ఈ హెచ్చుతగ్గులు తొలిగిపోయేటట్టు లేవు. ఫస్టుక్లాసులనీ, సెకండు క్లాసులనీ బోగీలు తగిలించి ప్రయాణీకుల్ని వర్గాలుగా విడదీసే యీ బ్రిటీష్ పెట్టుబడిదారీ పాత సంప్రదాయం తొలగిపోవాలి. అన్నీ ఒకే క్లాసులో వుంచి, అవసరమైతే సగం రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తే సరి, రైళ్ళలోనూ సోషలిజం వస్తుంది. ఇంత చిన్న రైల్లోనే సోషలిజం తేలేనప్పుడు యింత సువిశాలదేశంలో సోషలిజం తేగలరని అనుకోవడం కల్ల."

     "అసలు ప్రభుత్వమే అడుక్కుతినే ప్రభుత్వమైనప్పుడు ప్రజలు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు? ఈ దేశంలో అడుక్కోవడమే లాభసాటి వృత్తి. ఈ దేశంలోనే కాదు రోజంతా పనిచేస్తే దొరికే రోజువారీకూలి బత్తేనికీ, అడుక్కుతినేవాడి రోజువారీ ఆర్జనకీ అట్టే తేడాలేని ఏ దేశంలోనైనా అడుక్కోవడమే లాభసాటి. అడుక్కునేవాళ్ళు లేకుండా వుండాలంటే కూలీల రోజువారీ బత్తెం ఎక్కువ కావాలి. అది ఎక్కువయినప్పుడు దుర్బలులు, అంగవికలులు తప్ప మిగిలిన వాళ్లంతా కూలిపనికే ఎగబడతారు."

     ఇవీ ప్రముఖ చిత్రకారులూ, రచయితా అయిన శీలా వీర్రాజుగారి ఆలోచనలు. వీరి ఆలోచనా సరళిని పూర్తిగా పట్టుకోవాలంటే కథాజగత్‌లోని నీడ కథను చదవండి.

    అలాగే శీలా సుభద్రాదేవిగారి కథ రంగులవల చదవడం మరచిపోకండి.  

కామెంట్‌లు లేవు: