...

...

20, ఫిబ్రవరి 2012, సోమవారం

కథావిశ్లేషణ పోటీ ఫలితాలు!!!


వర్తమాన కథా కదంబం కథాజగత్‌లో 200 కు పైగా కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క కథావిశ్లేషణ పోటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి 29 ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటిలో విజేతలను నిర్ణయించడానికి న్యాయ నిర్ణేతలుగా ప్రఖ్యాత కథా రచయితలు శ్రీ విహారిగారు మరియు శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు వ్యవహరించారు. వారు ఈ ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. వారి నిర్ణయం ఇలా వుంది. 

మొదటి బహుమతి వనజ వనమాలి గారికి సామాన్య గారి కథ కల్పనపై విశ్లేషణకు. 

రెండవ బహుమతి లక్ష్మీ మాధవ్ గారికి అడపా చిరంజీవిగారి కథ అంతర్ముఖం పై విశ్లేషణకు.

మూడవ బహుమతి శైలజామిత్ర గారికి అంబికా అనంత్‌గారి కొడిగట్టరాని చిరుదీపాలు కథపై విశ్లేషణకు. 

విజేతలకు మా అభినందనలు! మొదటి బహుమతిగా వనజ వనమాలి గారికి రూ 2000/- విలువజేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను, రెండవ బహుమతిగా లక్ష్మీ మాధవ్ గారికి 1000/- విలువ కల కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను, మూడవ బహుమతిగా శైలజామిత్రగారికి 500/- విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపను పంపడం జరిగింది. ప్రోత్సాహక బహుమతిగా పాల్గొన్న వారందరికీ 50/- విలువ జేసే కథాజగత్ ఇ- పుస్తకాన్ని ఇదివరకే పంపడం జరిగింది. మొదటి బహుమతి మరియు ప్రోత్సాహక బహుమతులను స్పాన్సర్ చేసిన కినిగె డిజిటల్ టెక్నాలజీస్ వారికీ ముఖ్యంగా చావా కిరణ్‌గారికి, రెండవ మరియు మూడవ బహుమతులను స్పాన్సర్ చేసిన మిత్రుడు ఎ.మంజునాథ్ శెట్టి(గుత్తి)కీ నా ధన్యవాదాలు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన పెద్దలు విహారిగారికి మరియు మిత్రులు మురళీకృష్ణ గారికీ నా కృతజ్ఞతలు.

10 కామెంట్‌లు:

మాలా కుమార్ చెప్పారు...

విజేతలు వనజ వనమాలి గారికి .

లక్ష్మీమాధవ్ గారికి,

శైలజా మిత్ర గారికి అభినందనలు .

ఈ పోటీలో పాల్గొనే అవకాశమిచ్చి , 50 రూపాయల విలువజేసే ఇ పుస్తకాన్ని ఇచ్చిన కథాజగత్ వారికి దన్యవాదాలు .

Lakshmi Raghava చెప్పారు...

వనజ వనమాలిగారు,లక్ష్మీ మాధవ గారూ, శైలజ మిత్రగారు అందుకోండి అభినందనలు.
కతజగత్ వారికీ ధన్యవాదాలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

"కథా జగత్ .. వారికి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ విహారి గారికి,కస్తూరి మురళీ కృష్ణ గారికి మనః పూర్వకధన్యవాదములు. దాదాపు రెండు వందల కథలలో పాఠకురాలిగా నేను అడుగుపెట్టడమే నాకు అసలైన బహుమతి. కథా విశ్లేషణలో పాల్గొనడం కూడా.. ఒక సామాన్య పాఠకురాలికి కథలు చదవడం పట్ల అనురక్తి మరియు కథలోని విషయం పట్ల.పాత్రల చిత్రీకరణ పట్లసునిశిత పరిశీలనా..శక్తి తో పాటు.. ఆ పాత్రల స్వభావాన్ని అవగాహన చేసుకుని కథని విశ్లేషించుకుంటే.. మంచి కథ ఏదో మనకి మనకి తెలుస్తుంది అని నా అభిప్రాయం. నేను అలాగే "సామాన్య" గారి "కల్పన" కథని చూసాను. మంచి ఇతి వృత్తం తో పాటు కథా రచయిత కథని అందించడంలో యెంత వరకు కృతకృత్యులయ్యారో అన్నది కథ విజయానికి మూలకారణం అనుకుంటాను.

నా ఈ విశ్లేషణకి బహుమతి రావడం నాకు చాలా ఆనందదాయకం అనే కంటే.. "కల్పన" కథలోని స్త్రీ పాత్రల అంతరంగం,ఆలోచనల,ఆవేదనల ఉదృతిని అర్ధం చేసుకుని ఆ కోణంలో నేను చేసిన విశ్లేషణకి వచ్చిన బహుమతి అని నేను భావించడమైనది. "సామాన్య"..గారు.. మరొకసారి మంచి కథని అందించిన మీకు అభినందనలు. అందరికి ధన్యవాదములు.

కథ జగత్ ని నిర్వహిస్తున్న మురళీ మోహన్ గారికి,కథా విశ్లేషణ కి బహుమతుల్ని అందించి ప్రోత్స హిస్తున్న చావా కిరణ్ కుమార్ గార్కి మనః పూర్వక ధన్యవాదములు. "

సి.ఉమాదేవి చెప్పారు...

వనజ వనమాలి గారికి,లక్ష్మీమాధవ్ గారికి,

శైలజా మిత్ర గారికి విజయాభినందనలు .

ఈ పోటీలో పాల్గొనమని ప్రోత్సహించి,విలువైన
ఇ పుస్తకాన్ని ఇచ్చిన కథాజగత్ వారికి,కినిగె వారికి ధన్యవాదాలు.

Manasa Chamarthi చెప్పారు...

Congratulations to all the winners :)

శ్రీలలిత చెప్పారు...

వనజా వనమాలిగారికి, లక్ష్మీమాధవ్ గారికి, శైలజా మిత్రగారికి హృదయపూర్వక అభినందనలు.
ఇన్ని మంచి కథలు చదివి, విశ్లేషించే అవకాశం కల్పించిన "కథాజగత్"వారికి ధన్యవాదములు..

ఊకదంపుడు చెప్పారు...

ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు గానీ, నేను ఎంచుకున్న కధాకూడా ఇదేనండీ. కానీ, రోజు విశ్లేషణ వ్రాయటానికి కూర్చోవటమ్, మీ బ్లాగ్ కు రావటం - అక్కడ నుంచి మిగిలనవారి విష్లేషణలు, బాపతు కధలు చదవటం తోనే గడువు దాటిపోయింది. విహారి గారు నిర్ణేతలలో ఉన్నారని ముందు చెప్పారు గారు, వారి కధ "బతకనివ్వండి" కూడ నేను విశ్లేషణ కోసం ఎంపికచేసుకున్న కధలలో ఒకటి. :)

ఈ పోటి లో పాల్గొన్న వారికి, విజేతలకు అభినందనలు.
కధా జగత్తు వారు ఇలాంటి పోటిలు మరిన్ని నిర్వహిస్తారని, మరిన్ని మంచి కధలు ప్రచురిస్తారని ఆశిస్తూ...
భవదీయుడు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత్ర గారికి అభినందనలు .

అజ్ఞాత చెప్పారు...

పోటీలో విజేతలకు అభినందనలు.

knmurthy చెప్పారు...

వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత్ర గారికి అభినందనలు .