...

...

6, నవంబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 56



ఆధారాలు:

అడ్డం:

1. రావిశాస్త్రిగారి అసంపూర్ణ నవల (3, 3)

4. రాచకొండవారి తొలి నవల (4)

6. ఈ మల్లారెడ్డి వీచిక అనే పత్రికను నడిపారు (3)

7. కాకిగూడులోని  కాననము (2)

8. మురళీమోహన్‌కు చెందిన సంస్థ. నాది కాదు :) (4)

10. చదరంగంలో పావు (3)

11. వెదురు చాప మొదలగు వానితో ఏర్పర్చిన మరుగు (2)

12. నాగరికత కాని దానిలో స్టోరీ లేదు (4)

17. అభ్యంగనము (3)

19. పరిమితంలో మొదటి మూడింటికే పరిమితం చెస్తే వ చ్చే కొందరి ఇంటిపేరు (3)

20. ఉచితముగా (3)

21. రేపటికొడుకు సినిమాలోని లాలిపాట (4)

23. కన్నడిగుల మాత (2)

24. తిరగబడిన సౌత్‌ వెష్టు (3)

25. కష్టజీవి కాదు (4)

27. __ రాకడ లేదు, ఘడియ పురసత్తు లేదు. (2)

    28. శ్రీలంక క్రికెట్టు వీరుడు ఈ జయవర్ధనే (3)
    29. ఇటీవల రామాయణం వ్రాసిన సహజకవి ఈ రెడ్డిగారు (4)
    30. గడియారం వారి ఛత్రపతి శివాజీ చరిత్ర (6)
నిలువు:
1. గగనం, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమా కథలను తనవిగా క్లెయిమ్ చేసుకున్న రచయిత్రి (3,4)
2. ఎమ్బీయస్ ప్రసాద్‌గారి హాస్యకథల్లోని హీరో (3)
3. యజమాని లేదా బ్రాహ్మణుడు (3)
4. కలకలం వంటిదే (4)
5. విహరించే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (3)
7. కాటుకలో కరిచిన గాయము (2)
9. కప్ప (2)
11. సుందరి మిలాఖత్ తరువాత (4)
13. తాండూరు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి (4)
14. సప్తస్వరాల్లో మేటి (3)
15. గుణ్ణం గంగరాజు సినిమా (2)
16. శ్రీనాథ కవిసార్వభౌముని కావ్యం (3, 4)
18. ఒక హిందుస్తానీ సంగీత రచన, చిన్నపాట (2)
22.  కొమ్మ (2)
23. మలయాద్రి (4)
24. తీగ (2)
25. తెలుగులో పజిళ్ళ నిర్మాత అల్లంరాజు వారు (3)
     
    26. ఏకశిలలో కుండ (3)
     
    27. గలాటా (3)


4 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అడ్డం:- ౧. రత్తాలు రాంబాబు ౪.అల్పజీవి ౬.గజ్జెల ౭.కాడు ౮.జయభేరి ౧౦.కాల్బంటు ౧౧.దడి ౧౨.అనాగరి ౧౭.తలంటు ౧౯.పరిమి ౨౦.తేరగా ౨౧.రామలాలి ౨౩.తాయి ౨౪.తిఋనై ౨౫.సుఖజీవి ౨౮.మహేల ౨౯.మల్లెమాల ౩౦.శివచరితము

నిలువు:- ౨.రాంపండు ౪.అలజడి ౫.విహారి ౭.కాటు ౯.భేకి ౧౧.దరిమిలా ౧౩.నాపరాయి ౧౪.గరిమ ౧౫.ఐతే ౧౬.శృంగారనైషధము ౨౨.శాఖ ౨౩.తావిమల ౨౬.కలశి

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. రత్తాలు రాంబాబు; 4. అల్పజీవి; 6. గజ్జెల; 7. కాడు; 8. జయభేరి; 10. శకటు; 11. దడి; 12. అనాగరి (?); 17. తలంటు; 19. పరిమి; 20. తేరగా; 21. రామలాలి; 23. తాయి; 24. తిరృనై; 25. సుఖజీవి; 27. గవ్వ; 28. మహేల; 29. మల్లెమాల; 30. శివభారతము.
నిలువు -
1. ముచ్చెర్ల శకుంతల; 2. రాంపండు; 3. బుగత; 4. అలజడి; 5. విహారి; 7. కాటు; 9. భేకం; 11. దరిమిలా; 13. నాపరాయి; 14. గరిమ; 15. ఐతే; 16. శృంగార నైషధము; 18. టుమ్రీ; 22. శాఖ; 23. తావిమల; 24. తివ్వ; 25. సుధామ; 26. కలశి; 27. గల(లా)భా.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) రత్తాలు రాంబాబు, 4) అల్పజీవి, 6) గజ్జెల, 7) కాడు, 8) జయభేరి, 10) శకటు, 11) దడి, 12) అనాగరి, 17) తలంటు, 19) పరిమి, 20) తేరగా, 21) రామలాలి 23) తాయి, 24) తిరునై, 25) సుఖజీవి, 27) గవ్వ, 28) మహేల, 29) మల్లెమాల, 30) శివభారతము.

నిలువు: 1) రజనీ శకుంతల, 2) రాంపండు, 3) బుగత, 4) అలజడి, 5) విహారి, 7) కాటు, 9) భేకం, 11) దరిమిలా, 13) నాపరాయి, 14) గరిమ, 15) ఐతే, 16) శృంగార నైషధము, 18) టుమ్రి 22) శాఖ, 23) తావిమల, 24) తివ్వ, 25) సుధామ, 26) కలశి, 27) గలభా,

కంది శంకరయ్య చెప్పారు...

1 నిలువు సమాధానం -
రజనీ శకుంతల.