...

...

15, సెప్టెంబర్ 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 49


ఆధారాలు:  
అడ్డం:

1. అడవి బాలకి కాదు వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలామందే ఉన్నారు (4)
3. సదాను పోలిన నటి (పేరులో) వెనుదిరిగింది (2)
7. అబద్ధము కానిది అటునుంచి (2)
8. ఎక్కడికి? లిటరరీ మీటింగుల కే నా? (3, 4)
1 0. బాపినీడు నడిపిన ఓ పత్రిక గజిబిజి అయ్యింది (3)
12. సర్వసాధారణమైన విషయం కాబట్టే తడబడింది (11)
13. అటునుంచి దగ్గు (3)
14. భారతీయుడు సినిమాలో కథానాయిక (3, 4)
15. పానము లేని పానపాత్రము వెనుకనుంచి (2)
17. పేరాశలో విషయ పరిచ్ఛేదము (2)
18. తి. తి. దే తాజా మాజీ ఛైర్మన్గారు కొంచెం తడబడ్డారు పాపం (11) 

నిలువు:
1. గలివర్ ట్రావెల్స్ మాతృక అనదగిన మొదటి తెలుగు నవల. పంతులుగారిది  (4, 4, 3)
2. హాని కలిగించడానికి ఇది విషం కాదు కదా! అమృతం లాంటి తేనె (2)
3. పెరుగుట విరుగుట కొఱకే ధర తగ్గుట హెచ్చుట కొఱకె జాబితాలో మొదటిది. మొదట్లోనే కాస్త తత్తరపడింది (4, 4, 3)
4. జంఘాల శాస్త్రిగారి పిక్క ఒకటి తలక్రిందలయ్యింది J (2)
5. కాంతం కథల యతిపద్మరాగమానవకంఠీరవ రావుగారు J (5, 6)
8. జనాదరణ పొందిన ఈలపాట రఘురామయ్య గారి శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా పాట. చివరలో హ్రస్వమే (3, 4)
9. రాజ్యాంగ న్యాయశాస్త్రము ఆంగ్లంలో (6, 1)
10. మొదటి రెండు వదలి పారాయణము చేయుము (3)
11. కింగ్స్ టన్రాజధానిగా గల ద్వీపము (3)
16. పాడియావు ధర్మాన్ని చూపుతుందా? ( 2)
17. దారము పేను (2)


4 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) సహకార సముదాయ సంఘము, 6) త్యని (నిత్య), 7) జంని (నిజం), 8) సాకేత సర్వబౌమ్ కా, 10) యవిజ (విజయ), 12) ర్వసాసధాణరమైవిషయంన, ( సర్వ సాధారణమైన విషయం), 13) ముసకా (కాసము), 14) మనీషా కొయిరాలా, 15) త్రపా (పాత్ర), 17) పేరా, 18) లుడిఆదినాకేశయుడుకెవు (డి కె ఆదికేశవులునాయుడు).

నిలువు: 1) సత్యరాజ పూర్వదేశ యాత్రలు, 2) హని, 3) మురసస విరసము కొరకే ( సరసము విరసము కొరకే), 4) ఘజం (జంఘ), 5) మునిమాణిక్యం నరసింహరావు, 8) సాహిత్య సమాగమ, 9) కాన్సిట్యూషనలు లా, 10) యణము, 11) జమైకా, 16) పాడి, 17) పేకె,

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ! మీరు పంపిన సమాధానాల్లో అడ్డం 1,12 నిలువు 8,17 తప్ప మిగిలినవి సరియైన సమాధానండీ!

ఆత్రేయ చెప్పారు...

1 సహకార పరపతి సంఘం
౬ త్య ని
౭ జం ని
8 సాహిత్య సభలకా
10 యవిజ
12 ర్వస సాధారణ మై విషయం న
13 ముగుకా
14 మనిషా కోయిరాలా
15 త్ర పా
17 పేరా
18 లుడిఆదిశ కేనాయుడుకేవు
నిలువు
1 సత్యరాజ పూర్వ దేశ యాత్రలు
2 హని
4 ఘజం
5 మునిమాణిక్యం నరసింహారావు
8 సాకేత సార్వభౌమ
9 కాంస్టిట్యూషనల్ లా
10 యణము
11 జమైకా
16 పాడి
17 పేకే

mmkodihalli చెప్పారు...

ఆత్రేయ గారూ! దాదాపు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కానీ నిలువు 17 ఒకటి అడ్డం 13 ఒకటి తప్పండీ.

భమిడిపాటి సూర్యలక్ష్మి గారికీ, ఆత్రేయగారికీ అభినందనలు!