...

...

19, ఫిబ్రవరి 2011, శనివారం

మా బాదం చెట్టు - ఒక అభిప్రాయం

 
             కథాజగత్తులో కథలు చదువుదాము సరదాగా అని ఓపెన్ చేశాను ఇవ్వాళే... చాలా కథలు ఉన్నాయి ఏది చదువుదాము అని జస్ట్ ఒకసారి అలా చూసాను అన్నిటిని ... పేరు బట్టి కొంచం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. సో అలా చూస్తుంటే సడన్ గా మా బాదాం చెట్టు అని మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి కథ కనిపించింది. అరె బాదాం చెట్టు ఇదేదో చెట్టు గురించి రాసిన కథేమో అనుకుని చూద్దాం అని కథ చదవటం స్టార్ట్ చేశాను.
       
             అస్సలు ముందు ఇంట్రెస్ట్ ఎందుకువచ్చింది అంటే మా ఇంట్లో కూడా బాదాంచెట్టు ఉంది. మా తాతగారు పుట్టిన కాలం నాటిది. చాలా పెద్ద చెట్టు. మల్లాది గారు రాసిన వైనం అంతా చదువుతుంటే ఇదేదో నా భావాలే. నాకు ఇలాగే అనిపిస్తోంది మా చెట్టును చూసినప్పుడల్లా, అని మా చెట్టు గురించి కూడా చెబుతాము అనిపించింది.
        
           మేము కూడా చిన్నప్పుడు బాదం కాయలు కోసి బాదం పప్పులు బాగా ఇష్టం గా తినేవాళ్ళం. ఇప్పుడు ఉన్న పిల్లలు ఛి ఆ కాయలోని పప్పులా తినేది అని అంటున్నారు. వాళ్ళకేమి తెలుస్తుంది బాదం కాయను కొట్టి దానిలోని పప్పుని తింటే ఉండే రుచి. ఎప్పుడైనా చెట్టు నుండి వచ్చిన పప్పు రుచి వేరు మనకు ప్యాకెట్లలో దొరికే బాదం పప్పు రుచి వేరు.
      
              చెట్టు మీద ఎప్పుడూ కాకులు,రామచిలుకలు,ఉడుతలు ఉంటూ ఉండేవి. ఆ కాకిను చూపిస్తూ మాకు అన్నం పెట్టేదిట మా అమ్మ. ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా బాబుకు ఆ చెట్టు దాని మీద ఉన్న కాకులనే  చూపిస్తూ అన్నం తినిపిస్తాను. పక్షులకి చెట్లే కదండీ నివాసాలు పాపం ఆ చెట్లను మనం నరికేస్తే వాటికి నివాసం ఏముంటుంది. అందుకే పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. మనంతట మనమే వాటిని నాశనం చేస్తున్నాం.

         "వెధవ చెట్టు. కూరా, పళ్ళూ ఇవ్వదు. వెధవ చాకిరీ. రాలే బాదం ఆకులని ఏరలేక చస్తున్నాను." అలాగేలే. బొగ్గుల రాముడితో చెప్పి కొట్టిస్తాను" అనేవారు.
       
                    same ఇలాగే అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, కొట్టిచ్చేద్దాము ఎందుకు చిమ్మించటానికి నెలకు 25 రూపాయలు  అనవసరంగా ఖర్చు అని. మనం పెట్టె ఎన్నో అనవసర ఖర్చులతో పోలిస్తే ఒక 25 రూపాయలు కష్టం కాదు కదా,దానికోసం తాతల నాటి చెట్టు కొట్టిస్తామా.

        "ఆయన విస్తళ్ళు కుట్టడం నాకు ఆనందంగా ఉండేది. చీపురు పుల్లని తీసుకుని దాన్ని మధ్యకి చీల్చేవారు. రెండు బాదం ఆకులని పక్కపక్కనే ఉంచి పూచిక పుల్లని వాటి అంచుల్లోకి చొప్పించి కుట్టి విరిచేవాడు. అలా రెండు పూచిక పుల్లలు పూర్తయ్యేసరికి ఓ గుండ్రటి బాదం విస్తరి తయారయ్యేది."
   
            మా ఇంట్లో కూడా  భోజనం, టిఫిన్స్ కు కూడా ఈ ఆకులనే విస్తరి లాగా కుట్టి వాడేవాళ్ళం, పచ్చని ఆకులో తింటే ఆరోగ్యానికి మంచిది అని.
    
             మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లు పాతకాలంది కదా మొత్తం పడేసి (చెట్టు తో) సహా ఇల్లు కడదాము అని అనుకుంటున్నారు. నాకు కూడా మల్లాది గారికి వచ్చినట్టే దిగులు వచ్చేసింది. ఇంట్లో ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద చెట్లే అడ్డం వస్తాయి అందరికి.
    
            మనుషులతో కంటే ఇలాంటి చెట్లు, పక్షులు, జంతువులతో మనకు తెలియకుండా అనుబంధం ఏర్పడుతుంది.
          
            మల్లాది గారు చాలా సులభ శైలిలో రాసిన విధానం బాగుంది. ఇంట్లోని చెట్టు మీద ఆయనకు ఉన్న ప్రేమను బాగా రాసారు. పెద్ద పెద్ద చెట్లు(మామిడి,బాదం ఇలాంటివి) ఉంటే చక్కగా నీడను ఇస్తాయి. చల్లని గాలి వస్తాయి. మనం కొత్తగా నాటక పోయిన ఉన్న చెట్లని నాశనం చేయకపోతే అదే చాలు అని మల్లాది గారు చెప్పకనేచెప్పారు.
            
              మల్లాది గారు రాసిన వాక్యాలు చదువుతుంటే నా చిన్నతనం నా కళ్ళముందు కడులాడుతూ ఉంది. మేము కూడా ఇలాగె చేసేవాళ్ళం కదా అని అనిపించి కాసేపు నా చిన్నతనం లోకి నా మనస్సు పరుగులు తీసింది.


          మల్లాది గారు రాసిన కథ లింక్ ఇక్కడ ఇస్తున్నాను మీరు కూడా చదవండి.
 -మంజు

6 కామెంట్‌లు:

యామజాల సుధాకర్ చెప్పారు...

బాగుందండీ మీ బాదం చెట్టు ప్రహసనం. నాకు బాదంచెట్టుతో అనుభవం లేదు కాని, పనస చెట్టు గురించి బాగా తెలుసు. నన్నడితే పనస చెట్టు ఆకులు రాల్చడంలో రెండు ఆకులు ఎక్కువ తింది. పళ్లు తిండానికి బాగానే ఉంటాయి గాని రోజూ వూడ్చడంతో నా నడుం పడిపోతోందిరా అనేది మా అమ్మ. చాలా రోజులు ఆపగలిగాం గాని, మేము ఊరు నించి బయటకు ఒచ్చిన తర్వాత దానికి మోక్షం కలిగింది.

Unknown చెప్పారు...

This is everybody`s story if you belong to middle class family. Thanks for sharing the link.
Malladi Venkata Krishnamurthy

మాలా కుమార్ చెప్పారు...

మా బాదం చెట్టు తో మాకు పక్కింటి వాళ్ళతో ఎప్పుడూ గొడవలే !మా ఇల్లు సరిపోనట్లు , వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతాయి కొమ్మలు . వాళ్ళేమో గొడవ చెట్టు కొట్టించేయండీ , కొమ్మలు , ఆకులు మమ్మలిని ఇబ్బంది పెడుతున్నాయి అని . అది తప్ప వాళ్ళకూ ఆకూ పేచీ ఏమీ లేదు :)
ఆకులు ఊడవలేక నా నడుం పడిపోతుంది అని మా పనవ్వ ఎల్లమ్మ గోల . ఐనా అలా తిప్పలు పడుతూ వుంటాను కాని కొట్టించేయబుద్ది కాదు .
బాగారాసారు .

అజ్ఞాత చెప్పారు...

బాదాంచెట్టు నీడ బాగా దట్టంగా వుంటుంది. మధ్యాహ్నభోజనం తరువాత బాదాం చెట్టు నీడన, తాంబూలం వేసుకుని, ఓ కునుకేస్తే ... నా సామిరంగ, సొర్గానికి బెత్తెడు అనేవారు మా కీ.శే. పితామహులు. చెట్టు కొట్టేశాక మీ ఇంట్లో వేడి, 1డిగ్రీ పెరిగినా ఎండకాలంలో ఇబ్బంది. భూమ్మీద బ్రతికే మీలాంటి అదృష్టవంతులకు(మేం ఫ్లాట్లలో బ్రతికులీడుస్తున్న పక్షులం లేండి) ఈ సమాచారం వుపయోగిస్తుందేమో చూడండి.

http://kscst.org.in/rwh_files/Photos/rwh_photos_05.html

http://kscst.org.in/rwh_files/rwh_sourabha.html

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ కథ చదివి నేను మల్లాదిని తిట్టుకున్నా, నేను రాద్దామనుకుని బద్ధకించిన కథ రాసేశాడే అని!

మా (అమ్మా వాళ్ళ) ఇంటి పెరట్లో ఉండే బాదం చెట్టుతో మా ఇంట్లో అందరికీ ఎంతో అనుబంధం! భోజనాల వేళకి అమ్మమ్మ బాదం ఆకుల్తో విస్తరికుట్టుకునేది ఏ రోజుకారోజు. కొంచెం కూడా ఎండని నేల మీద పడకుండా చల్లని నీడని పరిచే బాదం చెట్టుకింద నవారు మంచం మీద పడుకుని మాంచి పుస్తకం చదూకున్నా...స్వర్గం బెత్తెడు దూరంలోనే ఉంటుంది.

వేసవి సెలవుల్లో పిన్ని పిల్లలూ, అత్త పిల్లలూ వచ్చినపుడు మధ్యాహానలు ఆ చెట్టుకిందే గడిచిపోయేవి మాకు మండుటెండల్లో కూడా! పేకాట, సీతారాముడూ, పాముపటం, ఛెస్సూ,carroms, అన్నీ ఆ చెట్టుకిందే! వెన్నెల వేళల్లో భోజనాలు కూడా!


ఆ చెట్టు కొట్టేయాలని, లేకపోతే డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పినా మా అన్న మాత్రం "పోతే పోయింది వెధవ డబ్బు! ఖర్చెప్పుడూ ఉండేదే, చెట్టు మాత్రమే కొట్టేది లేదు" అని చెప్పేసి మా అందరి మనసుల్నీ గెల్చుకున్నాడు

Unknown చెప్పారు...

నిన్న మా నాన్నగారు మా తోటలో బాదం చెట్టు కొమ్మలు, మొండెం వరకు కొట్టించేశారు. నాలుగు సంవత్సరాలు నుంచి ప్రాణంలా పెంచుకున్నాము మళ్లీ చిగురిస్తుందోలేదో చాలా బాధగా ఉంది.