...

...

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 39


ఆధారాలు:
1.  సన్నాజాజి కి గున్నా మావికి  మల్లెమాల పెళ్ళికుదిర్చింది ఈ సినిమాలోనే! (3,3)
3. టీ.వీ సీరియళ్ళకు దీన్ని మించిన పోలిక లేదు!(4)
5. ఇ.వి.వి, నరేష్‌ల కాంబినేషన్‌లో 1992లో వచ్చిన సినిమా!(7)
7. పెండ్లాము(3)
9. ఆవు ఒక __ ____.(2,3) 
10. తుహినశైలం.(5)
11. మొసలి కుడి నుండి ఎడమకు!(3)
14. రివర్సులో కాన్స్టిట్యూయన్సీ (4,3)
15. ఆడిదము సూరనకుగల టైటిల్!(4)
16. చంద్రమోహన్, సిద్ధార్థ ఇద్దరూ హీరోలుగా నటించిన వేర్వేరు సినిమాలు పేరు ఒక్కటే!(3,3)
నిలువు:
1. ముక్కోతి కొమ్మచ్చిని మనకు అందివ్వకుండానే జనతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళిపోయిన రచయిత.(4)
2. గీతాసింగ్, అల్లరి నరేష్‌లు నటించిన వెకిలి సినిమా.(5)
4. తోడా లివ లేవో, గుడి
    ఘోడాయే నివ్వలేవొ కొమరుగ దలపన్
    బోడెమ్మ చాకలివలె
    బేడా యిచ్చెదవు దూడ పేడా అరయన్
 
పై పద్యం పానుగంటివారి ఈ ప్రహసనంలోనిది(6)
5. జంజం అంటూ చేసుకునే పెళ్ళి(7)
6. భాజపా దృష్టిలో ప్రత్యేకంగా అద్వానీ దృష్టిలో మన్మోహన్ సింగ్ ఒక ____ ___.(4,3)
7. క్వార్టరు RUM కొట్టిన కపోతం.(3)
8. పట్టపురాణి శీర్షాసనం వేసింది.(3)
9. సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాసపత్రిక(3,3)
12. దయచూపు(5)
13. కర్ణాటకలోని అన్నపూర్ణేశ్వరీ దేవి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం(4)

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

అడ్డం: 1. ముత్యాల పల్లకి 3. జీళ్ళపాకం 5. జంబలకిడిపంబ 7. పాలుషి (?) 9.సాధు జంతువు 10. హిమనగము 11. రంకమ (మకరం తిరగబడి) 14.ముర్గవ కజయోని (నియోజకవర్గము తిరగబడి) 15. తిమ్మకవి (??) 16. చుక్కల్లో చంద్రుడు
నిలువు: 1. ముళ్ళపూడి 2.కితకితలు 4.కంఠాభరణం 5. జంపతజంపతము ( జంపతులు అంటే దంపతులు అన్నమాట మాత్రమే నాకు తెలుసు, దానినించి నా సొంత కవిత్వంతో అల్లిన క్లూ ఇది, ఖచ్చితంగా తప్పే) 6. బలహీన ప్రధాని 7. పావురం 8. షిహిమ (మహిషి తిరగబడి)9. సాహితీ స్రవంతి12.కనికరించు 13. హొరనాడు

mmkodihalli చెప్పారు...

ప్రసీద గారూ మీరు పంపిన సమాధానాలలో అడ్డం 15, నిలువు 5 మినహా అన్నీ కరెక్టేనండీ. కాకపోతే నిలువు 4 ఐదక్షరాలకే కుదించేశారు :)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) ముత్యాలపల్లకి, 3) జీళ్ళపాకం, 5) జంబలకిడిపంబ, 7) పాలుషి, 9) సాధుజంతువు, 10) హిమనగము, 11) రంకమ,(మకరం) 14) ముర్గవకజయోని ( నియోజకవర్గము),15) తిట్టుకవి, 16) చుక్కల్లొచంద్రుడు.
నిలువు: 1) ముళ్ళపూడి, 2) కితకితలు, 4) కంఠాభరణము, 5) జంజాటజంబూలము, 6) బలహీనప్రధాని,7) పావురం, 8) షిహిమ(మహిషి), 9) సాహితిస్రవంతి, 12) కనికరించు, 13) హోరనాడు.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ! 5నిలువు మినహా అన్నీ కరెక్టేనండి.