...

...

20, నవంబర్ 2009, శుక్రవారం

వస్తున్నాయొస్తున్నాయి...

వర్తమాన తెలుగు కథానికా కదంబం కథాజగత్‌లో త్వరలో వెలువడనున్న కథల వివరాలు.

1.అడపా చిరంజీవి - అంతర్ముఖం √

2.యర్రమిల్లి విజయలక్ష్మి - అమ్మ చెట్టు √

3.వడలి రాధాకృష్ణ - కొలువు √

4.రావూరి భరధ్వాజ - ఆహిరి √

5.శ్రీరాగి - కుడి ఎడమైతే √

6.వియోగి- వసంత కోకిల √

7.విశాల వియోగి - శృతిలేని రాగం √

8.రమ్య - రాంగు సుబ్బారావు √

9.కోడూరి శ్రీరామమూర్తి - తెరతీయగరాదా... √

10.సిద్దెంకి యాదగిరి - కీలెర్గిన వాత √


మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

11 కామెంట్‌లు:

Rani చెప్పారు...

cant wait :)

mmkodihalli చెప్పారు...

రాణి గారూ! టిక్ మార్కు పెట్టిన కథలన్నీ ప్రచురింపబడ్డాయి. చదవండి మరి.

Anil Dasari చెప్పారు...

అడపా చిరంజీవి అనే పేరు ఇంతకు ముందెప్పుడో విన్న/చదివిన గుర్తు ఉండటం చేతనూ, ఆయన 'అంతర్ముఖం' ఈ టపాలో మొట్టమొదట కనిపించటం చేతనూ 'కథా జగత్'లో దానికోసం వెదుక్కుని మరీ చదివాను. చదివాక వెనక్కొచ్చి ఈ వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోతున్నాను.

ఓ ఏకవాక్య నీతి బోధని నాలుగు పేజీలకు సాగదీయటం తప్ప అందులో కథంటూ ఏమన్నా ఉందా? కథలను ఓ చోట చేర్చి ఆన్‌లైన్ పాఠకులకు అందుబాటులో ఉంచాలనే మీ ఆశయం ప్రశంసనీయం. అయితే మొదట్లోనే 'అంతర్ముఖం' వంటి పసలేని కథలు ఎదురైతే పాఠకులు మిగతావి చదివే సాహసం చెయ్యకపోవచ్చు, మీ కృషికి గుర్తింపూ దొరక్కపోవచ్చు. కాబట్టి కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించగలరు.

mmkodihalli చెప్పారు...

అబ్రకదబ్ర గారూ మీకు పసలేని కథగా కనిపించింది మరికొందరికి అద్భుతమైన కథగా తోచవచ్చు కదా! మంచి కథ చెత్త కథ అనేవి సాపేక్షాలు కదా. చెత్త కథ అని తిరుగు టపాలో వచ్చి ఆ తర్వాత ఉత్తమ కథ అనిపించుకున్న దాఖలాలు ఉన్నాయి. అయినా మీ సూచనను తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరు వీలైనన్ని కథలు చదివి వాటిపై మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితే సంతోషిస్తాను.

Anil Dasari చెప్పారు...

మురళీమోహన్ గారు,

ప్రతివ్యాఖ్యకి ధన్యవాదాలు. సాపేక్షత విషయం ఒప్పుకుంటాను. కానీ అన్నిటికీ అలా అనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ ఎవరో ఒకరికి నాణ్యమైనదే అవుతుంది.

నా దృష్టిలో మంచి కథ అంటే - ఒక్క వాక్యమూ వదలకుండా చదివించేదిగా ఉండాలి. 'అంతర్ముఖం' అలా ఉందా? నా వరకూ లేదు. మొదటి కొన్ని వాక్యాలు చదవగానే అదో నీతి కథనేదీ, చివర్లో ఏం జరగబోతుందనేదీ అర్ధమైపోయింది. ఇక ఆసక్తెక్కడినుండి వస్తుంది?

కొలకలూరి ఇనాక్ గారి 'గృహ హింస' కూడా చదివాను. ఆయన రాసిన 'తల లేనోడు' నా ఆల్‌టైమ్ ఫేవరిట్ తెలుగు కథల్లో ఒకటి. అటువంటి రచయిత నుండొచ్చిన 'గృహ హింస' అతి నీరసంగా ఉండటం ఆశ్చర్యపరచింది. ఇక్కడా నేను పైన చెప్పిన సమస్యే. మరోసారి గమనించండి - ఎన్ని అనవసరమైన సంభాషణలున్నాయో, ఎంత రిపిటీషన్ ఉందో అందులో. రెండొందల పేజీలుండే నవలల్లో కొంతవరకూ అనవసరమైన సంభాషణలుంటే సహించొచ్చు. చిట్టి కథలని వాటితో నింపటం క్షమార్హం కాదు. షార్ట్ స్టోరీస్‌లో ప్రతివాక్యానికీ ఓ పరమార్ధం ఉండాలనేది నా అభిప్రాయం.

mmkodihalli చెప్పారు...

అబ్రకదబ్రగారూ!

నేను కథాజగత్ ప్రారంభించింది తెలుగులో వచ్చిన అన్నిరకాల కథలు (వర్తమాన రచయితలవి)ఒకే చోట అందివ్వాలనే ఉద్దేశంతో. పెద్దకథ, చిన్నకథ, కథానిక, గల్పిక, స్కెచ్, హాస్యకథ, శృంగార కథ, పత్తేదారు కథ, చారిత్రక కథ, జానపద కథ, పౌరాణిక కథ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ కథ, సస్పెన్స్ థ్రిల్లర్, దళిత కథ, స్త్రీవాద కథ, అభ్యుదయ కథ, విప్లవ కథ, అన్ని రకాల మాండలికాలలో వచ్చిన ప్రాంతీయ కథలు, కొసమెరుపు కథ ఇలా ఏపేరుతో వెలువడిన కథ అయినా ఈ వెబ్సైట్లో చోటు చేసుకోవాలన్నది నా అభిమతం. కథకు సంబంధించిన కంటెంట్లోనూ, స్టైల్ లోనూ, నెరేషన్ లోనూ వచ్చిన అన్నిరకాల ప్రయోగాలు, మార్పులు ఈ కథాజగత్లో రిఫ్లెక్ట్ కావాలనేది ఆశయం. దీనిలో నేను ఎంతవరకు కృతకృత్యుణ్ణయ్యాను లేదా అవుతాను అనేది ఆయా కథారచయితలు పంపే కథలపై ఆధార పడి వుంది. దీనిలో ప్రచురించే కథలను ఆయా రచయితలనే సూచించ మంటున్నాను. కొన్ని నిబంధనలు పెట్టినా వాటిని అంతగా పరిగణలోనికి తీసుకోవటం లేదు. కొందరు రచయితలు రెండు మూడు కథలు పంపి వాటిలో నచ్చినది వేసుకోమంటున్నారు. మరికొందరు నేను సూచించిన కథను కాకుండా వారికి నచ్చిన కథనే ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఇదంతా చెప్తున్నది కథల ఎంపికలో నా పాత్ర పరిమితమైనది అని చెప్పటానికే. అలా అని ఏదిపడితే అది ప్రకటించటం లేదనుకోండి.

mmkodihalli చెప్పారు...

కొలకలూరి ఇనాక్ గారి కథ విషయానికి వస్తే వారు ఈ మధ్యే ప్రచురించిన కథా సంపుటి 'కాకి' ఇచ్చి దానిలో నాకు నచ్చిన కథ వేసుకోమన్నారు. ఆ పుస్తకంలో వున్న కథలలో 'గృహ హింస' ఒక్కటే దళితవాద ఛాయలు కనిపించని కథ కావటమూ, మీరన్నట్టు కథలో సాగదీత ఉండటమూ ఆ కథను ఎంపిక చేసుకోవటానికి కారణం కావచ్చు. మీరు ఇదివరకే ఇనాక్ గారి 'తల లేనోడు' చదివి ఉన్నారు కాబట్టి ఆ కథతో సమానమైన లేదా అంతకు మించిన స్థాయి కల కథను ఆశించి 'గృహ హింస'ను చదివారు కాబట్టి ఆ కథ మీకు నీరసంగా కనిపిచింది. అదే 'తల లేనోడు'తో పోల్చకుండా చదివి ఉంటే మీ అభిప్రాయం మరోలా ఉండేది.

mmkodihalli చెప్పారు...

ఇక 'అంతర్ముఖం' కథ విషయానికి వస్తే ఆ కథను 'నీతి కథ' క్యాటగరీలో వేసుకుంటే అభ్యంతరం లేదు. నీతి కథలకు కథాజగత్లో చోటులేదని నేను అనుకోవటం లేదు.

mmkodihalli చెప్పారు...

అన్నట్టు మీ నాగరికథ చదివాను. బాగుంది. మీకు వీలైతే మీ నాలుగో కథను కథాజగత్ కోసం వ్రాయండి. కథ యూనీకోడ్ లోనే టైప్ చేసి నాకు మెయిల్ చేస్తే మంచిది.

Anil Dasari చెప్పారు...

మురళీమోహన్ గారు,

నా తరువాతి కథ కోసం అడిగినందుకు ధన్యవాదాలు. అయితే నేను తరచూ కథలు రాసేవాడిని కాను. మీకు వీలయితే 'నాగరికథ'ని కథాజగత్‌లో ఉంచండి. కావాలంటే దాని యూనికోడ్ వెర్షన్ పంపిస్తాను.

mmkodihalli చెప్పారు...

@అబ్రకదబ్ర గారూ,

కాస్త ఆలశ్యమైనా సరే కథాజగత్ కోసం ప్రత్యేకంగా ఒక కథ వ్రాసి పంపండి. కాదూ కూడదూ అనుకుంటే నాగరికథ యూనీకోడ్ వెర్షన్ మెయిల్ చెయ్యండి.